మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో తండ్రి, కొడుకు ఇద్దరూ కలిసి పుచ్చకాయను తిన్నారు. అయితే, తిన్న కొద్దిసేపటికే ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన కడుపునొప్పి, ఎడతెరిపి లేని వాంతులు, విరేచనాలతో వారు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తండ్రి కన్నుమూశారు. ప్రస్తుతం కుమారుడు ICUలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటనపై వైద్యులు స్పందిస్తూ, ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కేసుగా పేర్కొన్నారు.