నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులోని ఒక వ్యవసాయ పొలంలో తెరిచి ఉన్న బోరు గుంతలో ప్రమాదవశాత్తు నాలుగేళ్ల బాలుడు పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన బాలుడి తాత, స్థానిక ఉప సర్పంచ్ వెంకన్న (53) తన మనవడిని ప్రాణాలతో కాపాడుకోవాలనే ఆరాటంతో వెంటనే స్పందించారు. బాలుడిని పైకి తీసే క్రమంలో ఆయన కూడా అదే బోరు గుంతలో ఇరుక్కుపోయారు. స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోరు గుంతలోంచి తాత, మనవడిని పోలీసులు బయటకు తీశారు.