బండి భగీరథ్ దేశం దాటిపోకుండా.. అతనిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అతని కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని కేంద్రమంత్రి బండి సంజయ్ నివాసంలో ఓ బృందం తనిఖీలు నిర్వహించింది. భగీరథ్‌పై ఇప్పటికే పోక్సో కేసు నమోదైంది. అతనితో టచ్‌లో ఉన్నవారితోపాటు స్నేహితులు, బంధువుల ఇళ్లపై పోలీసులు నిఘా ఉంచినట్లు సమాచారం. నేడు నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోతున్నాడనే ప్రచారం ఉదయం నుంచి సాగుతోంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.