జనసేనకు బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి ఆహ్వానం అందింది. అనూహ్యంగా మెగా బ్రదర్ నాగబాబుకు ఆ పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో జనసేన నుంచి నాగబాబుకు అవకాశం ఖాయమని తెలుస్తోంది. ఇక.. మాజీ మంత్రి బాలినేని ఎమ్మెల్సీ కానున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు.. భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా బాలినేనికి అవకాశం దక్కే అవకాశం ఉంది. తాజాగా బాలినేనికి ప్రాధాన్యత ఉంటుందని పవన్ సైతం స్పష్టం చేసారు.