రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, సోమవారం (ఆగస్టు 04) రష్యాలోని నల్ల సముద్ర తీర ప్రాంతం గెలెండ్‌జిక్ సమీపంలోని ఆర్ఖిపో-ఒసిపోవ్కా బీచ్‌పై జరిగిన డ్రోన్ దాడి ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.అయితే డ్రోన్ అసలు లక్ష్యం బీచ్‌నేనా? లేక రష్యా వైమానిక రక్షణ వ్యవస్థ దానిని కూల్చివేసే క్రమంలో ఈ పేలుడు సంభవించిందా? అనే అంశంపై ఇప్పటివరకు స్వతంత్రంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు