ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించిన కామన్వెల్త్ గేమ్స్‌కు ఆదివారం అర్ధరాత్రి తెరపడింది. ఇక తర్వాతి కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2030లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఈ క్రీడలు జరుగనున్నాయి. క్రీడలకు సంబంధించిన బాటన్‌ను భారత దిగ్గజ అథ్లెట్ నీరజ్ చోప్రా అందుకున్నాడు. నీరజ్‌తో పాటు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్విలకు స్కాట్లాండ్ క్రీడల నిర్వాహక కమిటీ సభ్యులు బాటన్‌ను అందజేశారు.