యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దరఖాస్తులను పరిశీలించడానికి కమిషన్ మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించింది. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా లేని 569 దరఖాస్తులను గుర్తించింది. రూల్స్ బ్రేక్ చేసిన వారి ఫారాలన్నింటినీ తిరస్కరించింది. ఏఐ (AI) సహాయంతో, ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించడం, నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువసార్లు ప్రయత్నించడం లేదా తప్పుడు సమాచారంతో దరఖాస్తును నింపడం వంటి కేసులను గుర్తించారు. ధృవీకరణ పూర్తైన తర్వాత, అటువంటి దరఖాస్తులన్నింటినీ రద్దు చేశారు.