రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదివారం మెట్రో రైలు ఎక్కారు. బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి ప్యారడైజ్ వరకు ప్రయాణించి, స్టేషన్ల నిర్వహణను తనిఖీ చేశారు. మెట్రోలో ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలు, ఇంకా మెరుగుపడాల్సిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో రోజువారీ రద్దీ గురించి ఆరా తీశారు. నగర ప్రయాణికులకు సౌకర్యవంతంగా, వేగంగా గమ్య స్థానాలకు చేరే క్రమంలో మెట్రో అధికారులు, సిబ్బంది తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.