హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి. అరవింద్ బాబుపై బదిలీ వేటు పడింది. ఆయనను తక్షణమే విధుల్లోంచి తొలగిస్తూ, రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి నివేదించాల్సిందిగా ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్, అభ్యంతరకర కంటెంట్ పోస్ట్ చేశారనే ఆరోపణలపై మెటా ఇండియా ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.