ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. “ప్రజల కోసం నిలబడితే ప్రజలు మన వెంట నిలబడతారు, నిజం కోసం నిలబడితే నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదే నా నమ్మకం” అంటూ ఆయన నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో తనను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన ఘటన తనలో ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచిందని తెలిపారు.