రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకేతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య బహుముఖ భాగస్వామ్యాన్ని కవర్ చేసే అంశాలపై చర్చలు జరిపారు. ప్రాంతంలో భద్రత, శాంతి, శ్రేయస్సు నెలకొల్పే మార్గాలపై కూడా చర్చించారు.మూడు రోజుల పర్యటనకు సింగ్ మంగళవారం శ్రీలంక చేరుకున్నారు. రెండు దేశాల పౌరుల మధ్య బలమైన చారిత్రక, నాగరిక సంబంధాల ఆధారంగా లోతైన స్నేహం ఉందని నొక్కి చెప్పారు అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన వెల్లడించింది.