తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ రాజకీయ భవిష్యత్ విషయంలో బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి కీలక కండీషన్స్ పెట్టారు. ఆకాష్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలంటే.. ఆయన మామ, రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ పూర్తిగా రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని కండీషన్ పెట్టారు. ఆయన రిటైర్మెంట్ తర్వాతే ఆకాష్ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించే విషయాన్నిపరిశీలిస్తామని మాయావతి స్పష్టం చేశారు. అశోక్ సిద్ధార్థ్‌ను మాయావతి ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.