మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించారు. ఈ మేరకు ఎక్స్ పోస్టు చేశారు. మూడేళ్ల క్రితం వైకాపా ప్రభుత్వం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిందని పేర్కొన్నారు. నాటి చీకటి రోజును నిరసిస్తూ ‘నిజం గెలిచింది’ నినాదంతో కొవ్వొత్తులు వెలిగించినట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.