బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, యువరాణి కేట్ మిడిల్టన్ సోమవారం ముంబైలో సందడి చేశారు. ఈ పర్యటనలో భాగంగా వారు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను బ్యాలార్డ్ ఎస్టేట్‌లో కలుసుకున్నారు. పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రిన్స్ విలియం, సచిన్ సరదాగా గల్లీ క్రికెట్ ఆడారు. సచిన్ బౌలింగ్ వేయగా విలియం బ్యాటింగ్ చేసి అలరించారు. కేట్ మిడిల్టన్ కూడా కాసేపు బ్యాట్ పట్టుకుని సందడి చేయగా, సచిన్ వారికి బ్యాటింగ్ మెళకువలు సూచిస్తూ కనిపించారు.