థాయ్ లాండ్ లో దారుణం చోటు చేసుకుంది. ఫుకెట్ ద్వీపంలోని పటాంగ్ బీచ్ ప్రాంతంలో ఒక భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించారు. వీరిలో 8 మంది మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. 36 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. టూరిస్టుల కోసం బైక్స్ అద్దెకు ఇచ్చే భవనంలో ప్రమాదం జరగడంతో 100కి పైగా వాహనాలు తగలబడిపోయాయి. వాటి నుంచి వెలువడిన విష వాయువుల కారణంగానే లోపల చిక్కుకున్నవారు స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది.