మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష పోలీసులను ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ అనూష సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బొండపల్లి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. అప్పటి నుంచి తనకు సంబంధించిన తప్పుడు ప్రచారాలు, అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో వివరించారు.