‘ముందుగా లోకేశ్‌తో ప్రారంభిద్దాం.. ఆయనకు ఎక్కువమంది పిల్లలు ఉండాలని భావిద్దాం’ అంటూ.. చంద్రబాబు ఎక్కువ మంది పిల్లలు కనాలంటూ చేసిన వ్యాఖ్యలకు పూనమ్ కౌర్ కౌంటరిచ్చారు. ‘స్కూల్‌లో చదువుకునే రోజుల నుంచి చంద్రబాబు నాకు స్ఫూర్తి. చంద్రబాబు నాకు మొదటి గోల్డ్ మెడల్‌ను అందించారు. అందుకే అంత గొప్ప వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు నాకు మరింత బాధగా, ఆశ్చర్యంగా ఉంది. ఒక విధానాన్ని విమర్శించడం వేరు.. ఒక వ్యక్తిని విమర్శించడం వేరు’ అంటూ సమాధానం ఇచ్చారు.