గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో మొక్కజొన్న రైతులపై జరిగిన దాడులు, అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.రైతులకు సంబంధించిన ఓ గోడౌన్‌ను ప్రభుత్వం సీజ్ చేసింది. దాన్ని చూసేందుకు జోగి రమేష్ వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. జోగి రమేష్ అనుచరులు, వైసీపీ శ్రేణులు.. పోలీసు వాహనాల్ని అడ్డుకున్నారు. దాంతో పోలీసులు జోగి రమేష్‌ని అదుపులోకి తీసుకొని, అక్కడి నుంచి తరలించారు.