కాసు బ్రహ్మనందరెడ్డి పార్క్ వ్యవహారంలో సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఉద్యానవనం ఆవరణలో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని స్టే ఆర్డర్స్ జారీ చేసింది. తదుపరి విచారణ చేపట్టేంతదాకా పార్క్ 35 మీటర్ల పరిధిలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని అధికార యంత్రాంగానికి కోర్టు స్పష్టం చేసింది. ఎకో సెన్సిటివ్ జోన్ (25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను నరకరాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేసింది.