ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లకు బాధ్యుడిని చేస్తూ జవహర్ లాల్ యూనివర్సిటీ విద్యార్ధి నేత ఉమర్ ఖాలిద్ ను అరెస్టు చేసిన తర్వాత విచారణ పేరుతో ఆరేళ్లుగా బెయిల్ ఇవ్వకుండా సుదీర్ఘంగా జైల్లో ఉంచిన వ్యవహారంలో సుప్రీంకోర్టు తన సొంత తీర్పును ఇవాళ తప్పుబట్టింది. కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద సుదీర్ఘ నిర్బంధంపై తాను నిర్దేశించిన సూత్రాలను ఆ తీర్పు సరిగా పాటించలేదని ధర్మాసనం పేర్కొంది.