తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడేక్కాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. బీఆర్ఎస్ పార్టీకి కూడా నోటీసులు పంపించారు. అంగన్వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై నిరాధర ఆరోపణలు చేశారని ఈ నోటీసుల్లో సీతక్క పేర్కొన్నారు. తనపై బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కేసీఆర్‌దే బాధ్యత అని పేర్కొన్నారు. 48 గంటల్లో తనపై చేసిన పోస్టులు తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

