అబిడ్స్ నిజాం కాలేజీ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద అమిత్ సా నేతృత్వంలో మొదలైన మహా పాదయాత్ర మోజంజాహి మార్కెట్ వరకు కొనసాగింది. ఢిల్లీలో కాంగ్రెస్, ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ హైదరాబాద్ వేదికగా ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం- అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ అనే నినాదంతో అమిత్ షా నేతృత్వంలో బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది. అమిత్ షా జాతీయ జెండాతో రెండు కిలోమీటర్ల మేర ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు.

