అమెరికాలో థాంక్స్‌గివింగ్ పండుగకు ముందు విమాన సేవల్లో అంతరాయం ఏర్పడింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక సమస్య ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది. విమానం బరువు, సమతుల్యతను లెక్కించే ఆటోమేటెడ్ వ్యవస్థలో లోపం తలెత్తడంతో ఆదివారం ఒక్కరోజే వేలాది విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. సుమారు 2 వేల విమానాలు ప్రభావితమైనట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ వెల్లడించింది. సమస్యను పరిష్కరించేందుకు విమాన సంస్థ సిబ్బంది ప్రత్యామ్నాయ మాన్యువల్ విధానాలను అనుసరించారు.