తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రభుత్వంలో సామాజిక న్యాయం , అధికార పంపిణీ సమీకరణాలపై పార్టీలో అంతర్గత చర్చలు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కతో పాటు అదనంగా ఒక బీసీ నేతకు డిప్యూటీ సీఎం పీఠం కట్టబెట్టాలనే ప్రతిపాదనను బీసీ నేతలు అధిష్టానం ముందుంచినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 15 మంది మంత్రులు ఉండగా, కేబినెట్లో ఇంకా రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.