పల్నాడు జిల్లాలో మారణాయుధాలు కలిగి ఉన్నారని నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావు పై కేసు నమోదైంది. చిలకలూరిపేట యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ పదవి నామినేషన్ల ప్రక్రియ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ టీడీపీలోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సర్పంచ్ పదవి కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు, టీడీపీకి చెందిన నాగండ్ల రాంబాబుతో పాటు పావులూరి శ్రీనివాసరావు వర్గాలు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేశాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది.