మదర్సా బోర్డుల విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మదర్సాలు రద్దవుతాయి. కొత్త నిబంధన ప్రకారం.. గుర్తింపు కలిగిన మదర్సాలు ఇకపై సాధారణ స్కూల్స్‌గా పరిగణిస్తారు.ఈ మదర్సాలన్నీ రాష్ట్ర మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ అథారిటీ కిందికి వస్తాయి.పాఠ్యాంశాలు, పరిపాలన, గుర్తింపు వంటి వాటిని పర్యవేక్షించే బాధ్యత ఈ అథారిటీలదే.