కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం, చిన్నగొల్లపాలెం చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. బైకుకు తాళ్లతో కట్టిన మృతదేహాలను సోమవారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించారు. అవి శనివారం అదృశ్యమైన మామ, అల్లుడి మృతదేహాలుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు గ్రామస్థుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.