కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడుపై లైంగిక వేధింపుల వ్యవహారం కేసులో బాధితురాలైన మైనర్ బాలికకు న్యాయం జరగకపోవడం, ఆమెపైనే ఎదురు కేసులు నమోదు చేయడం వంటి అంశాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. “బేటీ బచావో” అనేది కేవలం ఎన్నికల నినాదమా? అని మోదీని నిలదీశారు. కేంద్ర మంత్రి కొడుకుపై చట్టపరమైన చర్యలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని, బండి సంజయ్ నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలన్నారు.