తమిళనాడు రాజకీయాల్లో ఎన్నడూ చూడని ఉత్కంఠకు, గవర్నర్ గిరీకి తెరపడింది. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎట్టకేలకు నాలుగో భేటీలో టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించారు. శనివారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల వివరాలు సమర్పించగా.. ఈసారి అర్లేకర్ అభ్యంతరం చెప్పకుండా సరేనన్నారు. దాంతో, ఆదివారం ఉదయం 10: 00 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.