బావిలో పడిన లేగదూడను కాపాడే ప్రయత్నంలో తండ్రీకొడుకులు మృతి చెందిన విషాద ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లిలో శనివారం నాడు చోటుచేసుకుంది.బావిలో పడిన లేగ దూడను కాపాడేందుకు వెళ్లిన పవన్ కు ఊపిరాడక నీటమునిగాడు అది గమనించిన తండ్రి కోడుకును కాపాడేందుకు బావిలోకి దూకాడు. ఈ క్రమంలో తండ్రి కూడా నీట మునిగి చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు.