కేంద్రమంత్రి బండి సంజయ్ కు ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోడీ టూర్ కు ఆహ్వానితుల జాబితాలో నుంచి బండి సంజయ్ పేరును తొలగించారు. కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరవుతున్న ప్రధాని మోడీ కార్యక్రమంలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు. దీంతో తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడికి పెద్ద షాక్ గా మారింది.