పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా భీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత సువేందు అధికారి శనివారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని చారిత్రక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వేడుకలో గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆయన చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.