పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. అగ్నిమిత్ర పాల్, దిలీప్ ఘోష్, అశోక్ కిర్టానియా, నిశిత్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడు మంత్రులుగా ప్రమాణం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు పాల్గొన్నారు.