రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై కొన్ని నెలల క్రితం హత్యాయత్నం జరిగినట్లు రష్యా అధికార వర్గాలు వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. నోవ్‌గోరోడ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ నివాసం వద్ద ఉక్రెయిన్‌కు చెందిన సిబ్బంది పుతిన్‌ను టార్గెట్ చేస్తూ దాడికి యత్నించినట్లు మాస్కో వర్గాలు తెలిపాయి.ఈ ఘటన తర్వాత రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ పుతిన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. దేశంలో అత్యంత భద్రత కలిగిన ప్రాంతాల్లోనే పుతిన్ ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలుస్తోంది.