తమిళనాడు పరిణామాలపై స్పందించిన మంచు మనోజ్, ప్రజల తీర్పే అత్యున్నతమని పేర్కొన్నారు. మార్పు కోసం ప్రజలు ఏకం అయితే చరిత్ర కూడా వారి ముందే తలవంచాల్సి వస్తుందని అన్నారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, ఇప్పుడు ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన శక్తి అతిపెద్ద పార్టీగా అవతరించడం చారిత్రక ఘట్టమని మనోజ్ పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలు విజయ్‌పై ఉంచిన నమ్మకమే ఈ విజయానికి కారణమని అన్నారు.