బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మోడలింగ్ రంగం ద్వారా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత రియాలిటీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నాలుగో వారంలో జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఆమెకు తక్కువ ఓట్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం. ప్రారంభం నుంచి తనదైన శైలిలో గేమ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోవడంలో ఆమె వెనుకబడినట్లు తెలుస్తోంది.