తిరుపతి జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉత్సవాల సందర్భంగా వాహన మండపం సమీపంలో ఏనుగు అదుపు తప్పి మావటి చంద్రయ్యను తొక్కేసింది. దీంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనలతో పరుగులు తీశారు. మావటికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమై ఏనుగును బంధించి గజశాలకు తరలించారు. పూర్తి శిక్షణ పొందిన ఏనుగు ఇలా అదుపు తప్పడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని భక్తులు పేర్కొన్నారు.