తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో సమంత రాసుకొచ్చిన అంశం వైరల్‌గా మారుతోంది. సమాజం ఇంకా ఏ మాత్రం మారలేదని సామ్ అభిప్రాయపడ్డారు.. లైంగిక కార్మికులను తప్పుబడతారు కానీ, వారి వద్దకు వెళ్లే కస్టమర్లను ఏమీ అనరు. ఒంటరి తల్లులను నానామాటలు అంటారు.. కానీ పిల్లల బాధ్యత తీసుకోని తండ్రులను ఎవరూ ప్రశ్నించరు. అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలినే తప్పుబడతారు కానీ నేరానికి పాల్పడిన వారిని నిలదీయరు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నామని సామ్ రాసుకొచ్చారు. సమంత పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.