జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో భారత మహిళల జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ పోరుకు అర్హత సాధించింది బంగ్లాదేశ్ మహిళల జట్టుతో జరిగిన కీలకమైన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరును సాధించింది. బంగ్లాదేశ్ జట్టు భారత బౌలర్ల కట్టుదిట్టమైన దాడిని ఎదుర్కొలేకపోయింది. పదిహేను ఓవర్ల నాలుగు బంతుల్లోనే కేవలం 71 పరుగులు మాత్రమే చేసి ఆ జట్టు ఆలౌట్ అయింది.