మితిమీరిన వేగంతో ప్రయాణిస్తోన్న ఓ విలాసవంతమైన కారు వంతెనపై నుంచి పడి ముగ్గురు మృతి చెందిన ఘటన ముంబయిలో చోటు చేసుకొంది. ముంబయిలోని కోస్టల్ రోడ్ బ్రిడ్జ్ పై ఆదివారం తెల్లవారుజామున మెరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీకి వెళ్తేన్న బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పింది. దీంతో వంతెన పైనుంచి పడిపోయింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది. అందులో ప్రయాణిస్తోన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరిని షన్యా గజ్జల్ (21)గా గుర్తించారు. ఇదే ఘటనలో మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.