వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడి పెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్ (55), అటెండర్స్ ఎల్లమ్మ (50), ఓంకార్ (33) కు గాయాలయ్యాయి. బాధితులు జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.