మైనారిటీల హక్కులను కాలరాస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి హిందువులు కదంతొక్కారు. రాముడి విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని, నిరసిస్తూ హిందూ సంఘాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం రాత్రి భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందువులు, విద్యార్థులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్, గైబంధ జిల్లాలోని పలాష్బరి కాంప్లెక్స్ దేవాలయ ప్రాంగణంలో 81 అడుగుల రాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. రాముడి విగ్రహాన్ని నిర్మించవద్దని అక్కడి ముస్లిం సంఘాలు, మత గురువులు హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం ఈ విగ్రహ నిర్మాణాన్ని నిలిపివేసింది.