బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (79) ఒకవేళ మళ్లీ దేశానికి తిరిగివస్తే ఆమెకు విధించిన మరణశిక్షను అమలు చేయడం తప్ప మరో మార్గం లేదని ఆ దేశ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. 2024లో ప్రజా తిరుగుబాటును దారుణంగా అణచివేసినందుకు గాను అక్కడి కోర్టు ఆమెకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. చట్టం ప్రకారం తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆ గడువు ఇప్పటికే ముగియడంతో హసీనాకు ఎలాంటి చట్టపరమైన అవకాశాలు మిగలలేదని స్పష్టం చేశారు.