సిట్ బృందం.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం అయిన కేసీఆర్‌కి నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్.. నందినగర్ లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు.. కేసీఆర్ పీఏకి నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. కేసీఆర్.. పోలీస్ స్టేషన్‌కి రావాల్సిన అవసరం లేదనీ.. ఎక్కడికి రావాలో చెబితే.. తామే వస్తామని తెలిపారు. కానీ రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందనీ, సిద్ధంగా ఉండాలని చెప్పారు.

