ప్రజాస్వామ్యం వ్యవస్థంలో కీలకమైన న్యాయ వ్యవస్థలోకి వెళ్లాల్సిన లా విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని లా పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. శనివారం కేయూ మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో కాపీ కొడుతూ విద్యార్థి పట్టుబడింది. అంతేకాదు తను ఏకంగా జవాబు పత్రంతో పరారైన సంఘటనతో ఒక్కొక్కటిగా మాస్‌కాపీయింగ్ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఇన్విజిలేటర్లు సైతం డబ్బులు తీసుకుని వారికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా సరే అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.