హైదరాబాద్ ఫిలింనగర్ లో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ప్రత్యేక ట్రిబ్యూట్ అందించారు. ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల పోస్టర్లు, సన్నివేశాలతో ఒక ప్రత్యేక వాల్ ను ఏర్పాటు చేశారు. ఈ వాల్ ‘సింగ్ గీతం’ మూవీ టీం రూపొందించింది. 94 సంవత్సరాల వయస్సులో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మూవీ ‘సింగ్ గీతం’.. రిలీజ్ నేపథ్యంలో ఆయన సినిమాల జ్ఞాపకాలను ప్రేక్షకులకు గుర్తు చేస్తూ మూవీ టీం వినూత్నంగా ట్రిబ్యూట్ అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

