సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఓటర్లకు ఎన్నికల సంఘం కీలక సమాచారం ఇచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్న ఓటర్లు తమ ఓటును కొత్త చిరునామాకు బదిలీ చేసుకునేందుకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అధికారిక ఫారం-8లోనే ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నివాసం మారిన సందర్భానికి ప్రత్యేక ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న SIRలో ఓటర్ల జాబితాలను మరింత ఖచ్చితంగా, తాజాగా రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నారు.

