సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ తన మిత్రుడితో కలిసి పోర్షే కారులో గిండి వైపు వెళ్తుండగా, ఒలంపియా టెక్ పార్క్ సిగ్నల్ వద్ద ఒక వ్యాగన్ ఆర్ కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో అమీన్‌తో పాటు ఆయన స్నేహితుడికి, అలాగే వ్యాగన్ ఆర్ కారులో ప్రయాణిస్తున్న మరొక వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు వారిద్దరినీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో వారు నివాసానికి చేరుకున్నారు.