కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ లో చేసిన పోస్టుపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. జైరాం రమేశ్ మదనపల్లి ఘటనను అర్థం చేసుకున్న తీరు వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజల్లో కనిపించింది ఆగ్రహం కాదని.. అపారమైన ఉత్సాహం, అనూహ్య స్పందన అని చంద్రబాబు తెలిపారు. సభ సజావుగా కొనసాగేందుకు ప్రజల ఉత్సాహం కారణంగా తాను కొద్దిసేపు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ప్రజల ఉత్సాహాన్ని ఆగ్రహంగా చిత్రీకరించడం సరికాదన్నారు.