ధర్మస్థల ఆలయం ఎపిసోడ్‌లో ప్రకాష్‌రాజ్ పేరు తెరపైకి రావడంపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. ‘ధర్మస్థల ఆలయంపై కుట్రలో ”మీ సహకారం ఉందని కుట్రదారుడు విచారణలో చెబుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రకాష్ రాజ్ గారు ఈ కుట్రకు మీరే పాత్రధారి, సూత్రధారి అని కూడా ఆరోపిస్తున్నారు. 130 కోట్ల మంది హిందువుల విశ్వాసాలను ఎందుకు దెబ్బతీశారు? మీకు హిందువులంటే అంత ద్వేషం ఎందుకు? ఈ ద్వేషంతో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు?’ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు విష్ణువర్థన్ రెడ్డి.

